రైతు మృతిపై ప‌వ‌న్ స్పంద‌న ఇలా

pawan kalyan

కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేస్ బుక్ ద్వారా స్పందించారు. రైతు మృతికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు ఆయ‌న‌. సానుభూతితో వ్యవహరించి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అన్నదాత స్వేదంతోనే బతుకుతున్న సమాజానికి రైతుల ఆర్తనాదాలు మంచివి కావన్నారు ప‌వ‌న్‌. రైతు కోటయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్న నేప‌ధ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు జనసేన నేతలు గుంటూరు జిల్లా కొండవీడు రైతు ప్రాంతానికి వెళ్తారని చెప్పారు.