ఈ ఏడాది తెనాలిలో సంక్రాంతి – పవన్ కళ్యాణ్…!

pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతి పండుగ ప్రజల మధ్యలో తెనాలిలో చేసుకోనున్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి లో నాదెండ్ల మనోహర్ గారి ఇంటి వద్ద కార్యకర్తలతో అత్యవసర సమీక్ష సమన్వయ సమావేసాయం ఏర్పాటు చేశారు.ఈ సమావేశములో రెండు బలమైన పార్టీలు , మన పార్టీ ఎదుగుదలను చూసి మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు.

ఈ ప్రచారాలు ఎవ్వరు నమ్మవద్దు అని, రానున్న ఎన్నికలలో 175 స్థానాలలో మనం పోటీ చెస్తున్నాము అని తెలిపారు.సంక్రాంతి పండుగకు తెనాలి డివిజన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు అని తెలిపారు. దానికి మనమంతా జనసైనికులు లాగా పని చేయాలని. డివిజన్ లోని అన్ని ప్రాంతాలలో మనము పర్యటించి , ప్రజల సమస్యలను, ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కోవాలని అనికార్య కర్తలకు సూచించారు.