పటమటలో ఓటేసిన పవన్‌ కల్యాణ్‌

Janasena party's CM candidate, film star turned politician Pawan Kalyan, had cast his vote in Vijayawada just a while ago.
Janasena party's CM candidate, film star turned politician Pawan Kalyan, had cast his vote in Vijayawada just a while ago.

రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా పటమటలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటమట పోలింగ్‌ కేంద్రంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఓటు వేశారు. అనేక చోట్ల ఈవీఎంలు పని చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈవీఎంల మొరాయింపుపై ఈసీ దృష్టకి తీసుకెళ్తామని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి ఓటు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని.