రేపటి నుంచి పవన్ గుంటూరు పర్యటన

PawanKalyan, Janasena, visakhapatnam, Guntur, Partyoffice,
Janasena Party

చలోరే చలోరే చల్ – జనంలోకి జనం కోసం అంటున్న పవన్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన శ్రేణులతో మమేకమవుతున్నారు . ఈనెల 26, 27 తేదీలలో గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి లో కొత్తగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరులోని ఇన్నర్‌ రింగురోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు మరియు ఎల్‌ఇఎమ్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహహిరంగసభ లోను పాల్గుంటారు . పార్టీ ప్రారంభోత్సవం అనంతరం గుంటూరు జిల్లా జనసేన పార్టీ శ్రేణులు సభాప్రాంగణం వరకు పెద్ద ఎత్తున ర్యాలీతో పాల్గొంటారు.