అప్పు చేసి ప‌సుపు – కుంకుమ ఇస్తోన్న సిఎం ..!

Chandra-Babu
Chandra-Babu

అప్పుచేసి డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ ప‌ధ‌కం ద్వారా న‌గ‌దుని అంద‌జేస్తున్నామ‌న్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్వహించిన పసుపు-కుంకుమ సభలో ఆయ‌న పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలు త‌న మానస పుత్రికగా ఆయ‌న చెప్పుకొచ్చారు. సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని సిఎం వెల్ల‌డించారు.

నాలుగున్నరేళ్లలో పసుపు-కుంకుమ కింద 21 వేల 116 కోట్లు అందజేశామని చెప్పారు. ఎవరి యాదాక్షిణ్యాలపై ఆడబిడ్డలు ఆధారపడకూడదని ఉద్దేశ్యంతో ఈ ప‌ధ‌కాన్ని ఏర్పాటు శామ‌న్నారు. రాబోయే రెండు నెలల్లో ఒక్కో డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో ప‌ది వేల రూపాయ‌ల చొప్పున జమ చేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. మూడు విడతలుగా చెక్కుల రూపంలో వాటిని అందజేస్తామన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోమహిళలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు సీఎం చంద్ర‌బాబు .