ఫాన్స్ వ‌ద్దు .. పార్టీయే ముద్దు – కేటీఆర్‌

KTR
KTR

తన పేరిట ఎటువంటి అభిమాన సంఘాలను అంగీకరించబోనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తన పేరు మీద యువసేనలను, అభిమాన సంఘాలను అంగీకరించనని క్లారిటీ ఇచ్చారు. ఇలా ఏర్పాటు చేసిన సంఘాలకు ఎలాంటి గుర్తింపు లేదని స్పష్టం చేశారు. తనపై అంతగా అభిమానం ఉంటే టీఆర్ఎస్ లేదా అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచించారు. తన పేరిట ఏర్పాటు చేసిన అభిమాన సంఘాలను రద్దు చేయాలని కేటీఆర్ కోరారు.