31 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు

Parliment
Parliment

ఈ నెల 31న నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పార్లమెంటు సమావేశాలు. పార్లమెంటు సమావేశాల్లో ఫిబ్రవరి 1న ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ నెల 30, 31న అఖిలపక్ష భేటీని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ వేర్వేరుగా నిర్వ‌హించ‌నున్నారు.