తెలంగాణ‌లో స్థానిక స‌మ‌రం షురూ

Local Elections
Local Elections

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దశలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 7న విడుదలౌతుంది. పోలింగ్ ఈ నెల 21న జరుగుతుంది. తొలి దశకు జనవరి 7నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు జనవరి 9, పరిశీలన 10వ తేదీన జరుగుతుంది. ఉపసంహరణకు 11వ తేదీ చివరి గడువు. జనవరి 21 మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్, అదే రోజున కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు విడుదల చేస్తారు.

మూడు దశలలో జరిగే పంచాయతీ ఎన్నికల రెండో దశ ఎన్నికలు నోటిషికేషన్ జనవరి 11న విడుదలౌతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి గడువు 13 కాగా పరిశీలన 14వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు జనవరి 15న, పోలింగ్ జనవరి 25న జరుగుతుంది. జనవరి 25 ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అదే రోజు ఫలితాలు విడుదలౌతాయి.

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మూడో దశకు నోటిషికేషన్ జనవరి 16న వెలువడుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రయ షురూ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జనవరి 18, 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి 20. జనవరి 25న ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడుతాయి. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నట్టు చెప్పారు.