ఢిల్లీలో ఎన్డీయేతరపక్షాల భేటీ

UPA
UPA

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు . ఒక్క పోలింగ్‌ బూత్‌లోని వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని విపక్ష నేతలు కోరుతున్నారు. 50శాతం వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందేనని సీఈసీని కోరినట్లు సమాచారం. దీనికి ముందు హ‌స్తిన‌లోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర పక్షాల నేతలంతా ఏపి సిఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్‌, అశోక్‌గెహ్లాట్, గులాంనబీ ఆజాద్‌, ప్రఫుల్‌ పటేల్‌.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి.. బహుజన్ సమాజ్ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా.. డీఎంకే నేత కనిమొళి.. తృణముల్ నుంచి ఒబ్రెయిన్ హాజరయ్యారు.