అఖిల ప‌క్షానికి అన్నిపార్టీలు డుమ్మా..!

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

వెల‌గ‌పూడిలోని సచివాయలయంలో సీఎం చంద్రబాబు సారథ్యం లో జరిగిన అఖిలపక్ష సమావేశంకు అన్ని ప్ర‌ధాన రాజీకీయ పార్టీలు డుమ్మా కొట్టాయి. ఈ భేటీకి ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన, వామపక్షాలు గైరు హాజ‌ర‌య్యాయి. కాగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌,బీఎస్పీ, ఎస్పీ , ప్రజాశాంతి పార్టీ, నవతరం, ఆమ్‌ ఆద్మీ, సచివాలయ ఉద్యోగులు, ఎన్జీవోలు, గెజిటెడ్‌ అధికారులు, రెవెన్యూ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు హస్తినలో అంతిమ పోరాటం చేయాలని ఈ స‌మావేశంలో డిసైడ్ అయ్యారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుండి 13వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణ‌యించారు. ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర బంద్‌కు సంఘీభావం ప్రకటించారు.11న ఢిల్లిలో ఆందోళన చేపట్టాలని, ఆ కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు.12న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు అఖిలపక్షంతోపాటు అవసరమైతే జాతీయ నేతలను కూడా తీసుకెళ్లనున్నట్లు సిఎం చంద్రబాబు వెల్ల‌డించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.