ధర్నాచౌక్‌లో అఖిలపక్షం నిరసన దీక్షలు

All Parties Protest
All Parties Protest

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో అఖిలపక్షం నిరసన దీక్షలు చేపట్టింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మృతిగా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌‌, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ . టిటిడిపి నేత ఎల్‌.రమణ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి కుంతియా, ప‌లువురు నేత‌లు, ఎమ్మార్పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మంద కృష్ణ మాదిగ‌, ప‌లువురు ప్ర‌జా సంఘాల నేత‌లు హాజరై నిరసన తెలిపారు.