బడ్జెట్‌ పై కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అవగాహన లేదు – కేసీఆర్

Telangana CM KCR
Telangana CM KCR

కాంగ్రెస్‌ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకుఆయ‌న సమాధానమిచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అవగాహన లేద‌న్నారు. బడ్జెట్‌లో సవరణలు ఉంటాయ‌ని, వాటిని తప్పుగా చిత్రీకరించడం సరికాద‌న్నారు. దేశంలోని 29 రాష్ర్టాల్లో కూడా బడ్జెట్ అంచనాల్లో సవరణలు ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలన్నదే తమ ధ్యేయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో అద్భుత పురోగతి సాధించామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో మైనర్‌ ఇరిగేషన్‌ ధ్వంసమైందని ఆయన అన్నారు. తమ్మిడి హెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా తవ్వలేదని ఆయన వివ‌రించారు. కేంద్రాన్ని నిధులు కోరినా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వ విధానాలను బట్టి రాష్ట్ర అవసరాలను మార్చుకోవాల్సి ఉంటుంద‌న్నారు ఆయ‌న‌.

రాబోయే రోజుల్లో నిర్మాణాత్మకంగా ముందుకెళ్లామ‌న్న సిఎం కేసీఆర్ , పరిపాలన విషయంలో కూడా పెనుమార్పులు చూడబోతార‌ని చెప్పారు. గతంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చాలా నిందలు వేశార‌ని , ప్రజలు మాత్రం కాంగ్రెస్ ఆరోపణలు తప్పని.. టీఆర్‌ఎస్ విధానాలు సరైనవని తీర్పు ఇచ్చార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెల్ల‌డించారు.