గోల్డ్ ఫిష్ టీజర్ : మెరుపులు పర్లేదు

Operation Gold Fish
Operation Gold Fish

వినాయకుడు సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుని కేరింత సినిమాతో యూత్ ఫుల్ హిట్ అందుకున్న సాయికిరణ్ అడివి రీసెంట్ గా రూపొందిస్తున్న సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్.ఈ సినిమా టీజర్ పరంగా చూస్తే ఇది టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక బ్రెయిన్ గేమ్ ఫిల్మ్ అని అర్ధమవుతుంది.ఇక గోల్డ్ ఫిష్ అంటే ఎవరు అనే థ్రిల్లింగ్ పాయింట్ తో సినిమాని ఎంగేజింగ్ మోడ్ లో నడిపించారని అర్ధమవుతుంది.

సినిమా కాన్సెప్ట్ తో పాటు స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాకి బలం అని అర్ధమవుతుంది.మెయిన్ కాస్ట్ తో పాటు సీజనల్ ఆర్టిస్టులకి కూడా మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలు దక్కినట్టు ఉన్నాయి.టాలెంటెడ్ అనిపించుకుని కూడా ఇప్పటివరకు విజయం అనేది అందక ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నవాళ్లందరికి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు సాయి కిరణ్ అడివి.పాకిస్థాన్,హిందుస్థాన్ కి ఉన్న తేడాలను డైలాగ్స్ తో బాగానే ఎలివేట్ చేసారు.ఈ సినిమాని త్వరగా రిలీజ్ చేసుకుంటే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ కూడా సినిమాకి ఫేవర్ గా మారే అవకాశం ఉంది.

ఈ సినిమాతో డైలాగ్ రైటర్ అబ్బూరి రవి ఫుల్ ప్లెడ్జెడ్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.టెర్రరిస్ట్ లా అతని లుక్ బాగానే ఉంది.యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.ఈ సినిమాని టెక్నికల్ గా కూడా చాలా ఎఫెక్టివ్ గా తీర్చిదిద్దాడు సాయి కిరణ్.చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసి కాన్సెప్ట్ ని నమ్ముకుని ఖర్చుకి వెనుకాడకుండా నిర్మించిన ఈ సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది.

గోల్డ్ ఫిష్ టీజర్