తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో కాంగ్రెస్ విల విల‌

Telangana Congress Party

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ మ‌రోసారి తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ హాట్ టాపిక్ గా మారింది. కొత్త అసెంబ్లీ తొలి స‌మావేశాల అనంత‌రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో చేరి. జంపింగ్‌లకు మళ్లీ తెరతీశారు. ఇక తాజాగా న‌ల్గొండ జిల్లాకు చెందిన కాగ్రెస్ ఎమ్మెల్యే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారి జ‌త క‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో కాంగ్రెస్‌కు కొత్త సమస్య ఎదురుకానుంది అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 10 శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీలో సభ్యులు 120 మంది వున్నారు. అందువల్ల ప్రతిపక్ష హోదా కావాలంటే కాంగ్రెస్‌కి కనీసం 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా దక్కింది. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 17కు పడిపోయింది. లేటెస్ట్ గా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఝ‌ల‌క్ ఇచ్చారు. దీంతో మరో ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు TRSలో చేరితే, కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదో కోల్పోతుంది.

మిగిలిన 16 మందిలోమ‌రి కొంత మంది ఎమ్మెల్యేలు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగా కారు ఎక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటు ఖమ్మం జిల్లాకే చెందిన మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంద‌రు టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్ర‌చారం అవుతోంది. ఇప్ప‌టికే స‌త్తుప‌ల్లి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన సండ్ర వెంక‌ట వీర‌య్య సైతం టి ఆర్ ఎస్ గూటిలోకి మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌ధ్యంలో అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా నిల‌బెట్టుకోవ‌డంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.