టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు

Tollywood Drug Case
Tollywood Drug Case

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 12 కేసుల్లో ఇప్పటి వరకు 4 కేసుల్లో చార్జిషీటు దాఖలు చేసిన సిట్‌ మరో 8 కేసుల్లో ఛార్జి షీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు సందర్భంగా మొత్తం 62 మంది నటీ నటులు, దర్శకులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారించినట్లు వివ‌రించారు. వీరి వద్ద నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించినట్లుగా వెల్ల‌డించారు. డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నిషియన్లను అధికారులు విచారించారు. అయితే ఇప్పటికే దాఖలైన నాలుగు ఛార్జిషీట్ లలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లను చేర్చలేదు.