ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రివ్యూ : తెలిసిందే కానీ బావుంది

#NTRMahanayakudu Official Trailer | Nandamuri Balakrishna, Rana Daggubati, Vidya Balan | Krish
#NTRMahanayakudu Official Trailer | Nandamuri Balakrishna, Rana Daggubati, Vidya Balan | Krish

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా టాక్ వరకు బావున్నా కూడా కమర్షియల్ గా మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలింది.దీంతో ఆ సినిమాలో కొన్ని సీన్స్ రీ షూట్ చేసి యాడ్ చేసారు.అలానే ఆ సినిమాలో మెయిన్ సీన్స్ ఎలివేట్ అయ్యేలా కొత్త ట్రైలర్ కట్ చేసి వదిలారు.మొదటి ట్రైలర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ కాస్త వ్యక్తిపూజ తగ్గింది. అందరికి తెలిసిన నాదెళ్ల వ్యవహారం వంటి వాటిని కాస్త ఆసక్తికరంగా,గ్రాండియర్ తో కలిపి చెప్పడానికి ట్రై చేసారు.ఈ ట్రైలర్ పరంగా చూస్తే పెద్దగా ఎక్సైట్ చేసే ఎలిమెంట్స్ ఏవీ ఉన్నట్టు కనిపించట్లేదు.భావోద్వేగాలకు సంబందించిన సీన్స్ ని ట్రైలర్ లో చూపించలేరు కాబట్టి ట్రైలర్ కాస్త మామూలుగా ఉంది అనుకోవాలి.

ఇక ఎన్టీఆర్ 60 ఏళ్ళు దాటిన వయసులో కనిపిస్తున్న పాత్ర కాబట్టి బాలకృష్ణ ఎక్కువ శాతం NTR ను గుర్తుచెయ్యగలిగాడు.కానీ సినిమాలో ఎంతవరకు ఎన్టీఆర్ ని మరిపిస్తాడో చూడాలి.విద్య బాలన్ పాత్రకు,రానా పోషించిన చంద్రబాబు పాత్రకు కూడా ఎక్కువ నిడివి దక్కినట్టు కనిపిస్తుంది.కీరవాణి సంగీతబలం కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది.కానీ ప్రచారానికి అస్సలు టైం లేకుండా పెద్దాయన చరిష్మా మీదే భారం వేసి వస్తున్న ఈ బాలయ్య బాబు సినిమా ఏమవుతుందో?,ఎలాంటి ఫలితం అందుకుంటుందో ఈ శుక్రవారం తేలిపోతుంది.