ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

N.T.R. Kathanayakudu
N.T.R. Kathanayakudu

నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్ , ప్రకాష్ రాజ్ , రానా, సుమంత్
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : బాలకృష్ణ , సాయి కొర్రపాటి , విష్ణు ఇందూరి
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ
విడుదల తేదీ : జనవరి 09, 2019

సినీసారథి రేటింగ్ : 3/5

సంక్రాంతి విజేతగా పేరున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి మాత్రం చాల ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన తండ్రి జీవిత చరిత్రను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ సినిమా మొదలుపెట్టారు. అయితే..ఆదిలోనే ఉంటుంద.. ఆగిపోతుందా అనేపెద్ద డౌట్ ని ఎదుర్కొని ఎట్టకేలకు క్రిష్ చేరికతో పట్టాలెక్కింది ఎన్టీఆర్ బయోపిక్,. ఫస్ట్ లుక్ దగ్గరనుంచి ప్రతి లుక్ తో అలరిస్తూ… టీజర్స్ తో అంచనాలు పెంచేస్త.. ట్రైలర్స్ తో ప్రామిసింగ్ గా అనిపించింది. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చింది. ఎన్టీఆర్ చరిత్రను సినిమాగా మలిచారు..మరి అలాంటి చారిత్రాత్మకమైన సినిమా కొత్త చరిత్రను సృష్టించిందా.. లేదా..? అసలు ఎలాంటి ఫలితం అందుకుంది..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

కథగా చెప్పడానికి ఇది కల్పితం కాదు..అనేకమందికి తెలిసిన అనేక నిజసంఘటనల సమాహారం. ఎన్టీఆర్ సినిమా కెరీర్ ఎలా మొదలయింది అనే అంశంతో మొదలుపెట్టి..రాజకీయ జీవితం ప్రారంభం వరకూ ఆసాంతం చాలా డీటైలింగ్ గా చూపించారు. అందరికీ తెలిసిన కథకు కొన్ని ప్రత్యేకఆకర్షణలు జోడించారు. అవి స్క్రీన్ మీద చూడాల్సిందే. ఎన్టీఆర్ అనే రైతుబిడ్డ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ఎలా ఎదిగాడు,..? అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా కలిగింది..? ఎలాంటి పరిస్తితుల్లో రాజకీయపార్టీని స్థాపించాడు అనే లైన్ ని సినిమాటిక్ గా ప్రెసెంట్ చేసారు.

విశ్లేషణ:

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకి ఉన్న అతిపెద్ద మైనస్ ఆయన కథ అందరికి తెలిసి ఉండడం.ఇప్పటికే అనేక మంది అనేక పుస్తకాలు రాసారు.అయితే వాటిని తెరపై ఆసక్తి కరంగా ప్రెసెంట్ చెయ్యడానికి క్రిష్ వేసిన ఎత్తుగడలు బాగా ఫలించాయి.ఈ సినిమాని రామ తారకం కోణం నుండి మొదలుపెట్టడం అనేది ఈ సినిమాకి ప్రధాన బలం.ఇప్పటివరకు ఏ పుస్తకంలోని చెప్పని ఎన్టీఆర్,ఆయన భార్యల మధ్య ఉన్న అనుబంధం,ప్రేమ చక్కగా ఎస్టాబ్లిష్ చేసారు.అవి మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ లో కనెక్టింగ్ ఫాక్టర్స్ ఏమీ లేవు.ఎన్టీఆర్ సినిమా కెరీర్ ఎలా సాగింది అనే సోలో పాయింట్ ని ఒకింత సాగదీస్తూ చెప్పారు.అయితే తీస్తున్నది ఎన్టీఆర్ బయోపిక్,ఫాన్స్ కి కిక్ ఇచ్చేది అవే అని భావించి క్రిష్ వాటికి ఫైనల్ కట్ లో స్తానం కల్పించాడు అని అర్ధమవుతుంది.ఇక ఈ సినిమాని రెండు పార్ట్స్ గా మలచాలి అనుకోవడం కరెక్ట్ కాదేమో అని సినిమా అయిపోయాక అనిపిస్తుంది.ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు.అందుకే నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందా అన్న భావనకన్నా కూడా అది కూడా ఇప్పుడే చూపించి ఉంటే బావుండేది అనిపిస్తుంది.ఫస్ట్ హాఫ్ వరకు ఫ్లాట్ గా ఉన్న సినిమా సెకండ్ హాఫ్ నుండి వడివడిగా కదులుతుంది.మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్స్ పడ్డాయి.చాలా తెలియని విషయాలు చూపించారు.మొత్తానికి పండగ సీజన్ కి పర్ఫెక్ట్ సినిమాతో వచ్చాడు బాలయ్య.అయితే లోపాలున్నా కూడా వాటిని అధిగమించే కంటెంట్ కూడా ఉంది.

నటీనటులు:

వందకు పైగా సినిమాలు చేసిన బాలయ్య ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చెయ్యడానికి ప్రయత్నిస్తాడు అనేది అనేక సార్లు రుజువు చేసి చూపించాడు. ఈ సినిమాకి కూడా చాలా శ్రద్దతో అంకితభావంతో పని చేశాడు అని సినిమాచూస్తే అర్దమవుతుంది. కానీ బాలకృష్ణ వయసు వల్ల ఎన్టీఆర్ పాత్రకు కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. ఫస్ట్ హాఫ్ వరకూ చెప్తున్నది ఎన్టీఆర్ కథ అయినా కూడా బాలకృష్ణే కనిపించాడు. కానీ ..రెండో భాగం నుంచీ ఎన్టీఆర్ దిగి వచ్చి నటించినట్టు మెప్పించాడు బాలకృష్ణ . హావభావాలు ఎమోషనల్ సీన్స్ అన్నింటిలో కూడా ఎన్టీఆర్ ను తలపించాడు బాలకృష్ణ . ఇక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన విద్యాబాలన్..తాను ఎంత పరిణతి చెందిన నటి అనేది తెలిసేలా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కి బసవతారకం ఎంత సపోర్ట్ ఇచ్చారో.. అంతకు మించిన సపోర్ట్ ఈ ఎన్టీఆర్ కి విద్యాబాలన్ రూపంలో దొరికింది. సినిమా ఫస్టాఫ్ అంతటికీ..ఆమె నటించిన ఎమోషన్ సీన్స్ హైలెట్ అనిపిస్తాయి. ఇక కళ్యాణ్ రామ్, రానా, సుమంత్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ANR గా సుమంత్ ..అక్కినేని మ్యాజిక్ ని సిల్వర్ స్క్రీన్ పై రీ క్రియేట్ చేశాడు. ఇక అవసరాల శ్రీనివాస్ , క్రిష్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, బుర్రా సాయిమాధవ్, దగ్గుబాటి రాజా, బ్రహ్మానందం, కైకాల సత్యన్నారాయణ, కృష్ణారెడ్డి, రామజోగయ్య శాస్త్రి ..ఇలా పదుల సంఖ్యలో జనాలకు బాగా తెలిసిన ప్రముఖులంతా తమ లిమిటెడ్ రోల్స్ లోనే సందడి చేశారు. శ్రియ, రకుల్ ప్రీత్ సింగ్, షాలినీ పాండే, హన్సిక, నిత్యామీనన్, ఇలా అనేక మంది యంగ్ హీరోయిన్స్..తమ ప్రజెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..

ఈ సినిమా క్రెడిట్ ఎక్కువ శాతం డైరెక్టర్ క్రిష్ కే చెందుతుంది. అందరికీ తెలిసిన ఎన్టీఆర్ చరిత్రను ఎక్కడా.. అతిశయోక్తులు లేకుండా పరిథిలోబడి చెప్పడం అనేది చాలా టఫ్ జాబ్. కానీ.. విజనరీ డైరెక్టర్ క్రిష్..సినిమాని తన ఊహల్లో చూసుకుని ఆల్ మోస్ట్ దాన్నే తెరపై ప్రజెంట్ చేశాడు. అయితే..ఎన్టీఆర్ మూవీ సీన్స్ కి సంబందించి సరైన లీడ్స్, సరైన కన్ క్లూజన్స్ మాత్రం మిస్ అయ్యాడు. లెన్త్ పరంగా కూడా ఇంకాస్త ట్రిమ్ చేస్తే..సినిమా డెప్త్ పెరిగేది. క్రిష్ కి ఫుల్ సపోర్ట్ అందిస్తూ..ఎన్టీఆర్ సినిమాకి తన మాటలతో పెద్ద ఎసెట్ గా మారాడు బుర్రా సాయిమాథవ్. ఎన్టీఆర్ ఇమేజ్ కి సరిసమానమైన డైలాగ్స్ డెలివర్ చేసాడు. ఇక పాటల పరంగా కీరవాణికి ఎలాంటి స్కోప్ దక్కకపోయినా…ఆర్.ఆర్ లో మాత్రం తన మార్క్ ను చూపించాడు.సరైన కంటెంట్ ఉన్న సినిమాకి కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటే అతను ఎలాంటి అద్బుతం చెయ్యగలడు..? సినిమా స్థాయిని ఎలా పెంచగలడు అనే దానికి ఈ ఎన్టీఆర్ సినిమా ఆర్.ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్. 1947 నాటి పరిస్తితులను వెండితెరపై సజీవంగా నిలపడంలో సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ సక్సెస్ అయ్యాడు. క్రిష్ ఊహలని తెరపైకి ట్రాన్స్ లేట్ చెయ్యడంలో గ్నానశేఖర్ శ్రమ అడుగడుగునా..ప్రతి ఫ్రేమ్ లో రిఫ్లెక్ట్ అయ్యింది. కీరవాణి, సిరివెన్నల సీతారామశాస్త్రి, శివశక్తి దత్తా ల సాహిత్యం అలరించింది. తన తొలి ప్రయత్నంతోనే డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన బాలయ్య..పరిమితులు పెట్టుకోకుండా.. సినిమాకు అవసరమైన ఖర్చు పెట్టారు. సాయి కొర్రపాటి..విష్ను సహకారం సినిమాకు ఉపయెగపడింది. మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు.

చివరిగా:

ఎన్టీఆర్ ఆరా తో .. ఆయన జీవితచరిత్రను వెండితెరపై చూపించడంలో ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా టీమ్ సక్సెస్ అయ్యింది. కాకపోతే అధి రెండు పార్ట్ లుగా రావడం వల్ల, సినిమా అసంపూర్ణంగా ముగిసిన భావన కలుగుతుంది.25 సంవత్సరాలు పైబడిన వాళ్లందరికీ, ఎన్టీఆర్ గురించి తెలసిన వాళ్లకు, ఎన్టీఆర్ అభిమాలనుకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. లెంగ్థ్ ప్రాబ్లమ్ ,కొన్ని కొన్ని ల్యాగింగ్ సీన్స్ మినహాయిస్తే.. ఎన్టీఆర్ కథానాయకుడు సరైన సంక్రాంతి బొమ్మగా రూపుదిద్దుకుంది. బాక్సాఫీస్ వద్ద బారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.