కాలర్ ఎగరేసిన కథానాయకుడు

NTR Kathanayakudu
NTR Kathanayakudu

ఎన్టీఆర్ బయోపిక్…సంక్రాంతి సినిమాల్లో ఇప్పటివరకు ఎక్కువ ఇంపాక్ట్ ఫుల్ గా,ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సినిమా ఇదే.అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా తీసి రెండు పార్ట్స్ కి కలిపి ఒకే ఆడియో ఫంక్షన్ అండ్ ఒకే ట్రైలర్ రిలీజ్ చేసిన సినిమా కూడా ఇదే.

అయితే ఇప్పడు బిజినెస్ పరంగా కూడా ఒక అరుదయిన రికార్డ్ అందుకున్నాడు కథానాయకుడు.ఇప్పడు ఆ టాక్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.బాలయ్య చాలా కాలంగా స్టార్ హీరో లీగ్ లో కొనసాగుతున్నా కూడా మార్కెట్ మాత్రం అంతగా ఇంప్రూవ్ కాలేదు.100 సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విషయంలో కూడా ఓ పెద్ద సంచనాలు నమోదవ్వలేదు.కానీ బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న బయోపిక్ మాత్రం కనకవర్షం కురిపిస్తుంది.

మొన్నటివరకు ఈ సినిమాపై కొన్ని డౌట్స్ ఉన్నా రీసెంట్ గా జరిగిన ఫంక్షన్ తో అన్నీ క్లియర్ అయిపోయాయి.అయితే ఇప్పడు సినిమాకి 71 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.బాలయ్య సినిమాల్లో ఆల్ టైం హయ్యెస్ట్ బిజినెస్ ఈ సినిమాకే జరిగింది.సంక్రాంతికి బాలయ్య సినిమాలకి పాజిటివ్ ఎడ్జ్ దక్కడం,ఈ సినిమా పై క్రియేట్ అయిన ఓవర్ హైప్ వల్ల ఈ రేంజ్ బిజినెస్ జరిగింది.