కథానాయకుడు సెన్సార్ కథ

NTR Kathanayakudu
NTR Kathanayakudu

కథానాయకుడు సినిమా సెన్సార్ విషయంలో ఒక విచిత్రమైన వార్త వినిపిస్తుంది.అఫిషియల్ గా అయితే ఈ సినిమాకి ఇంకా సెన్సార్ ఫార్మాలిటీస్ ఇంకా కంప్లీట్ కాలేదు.ఇప్పటికే సెన్సార్ స్లాట్ బుక్ చేసిన ఈ సినిమాకి ఇంతవరకు సెన్సార్ జరగలేదు అని అంటున్నారు.

అయితే దానికి కారణం రకరకాలుగా చెప్పుకుంటున్నారు.అయితే మరికొంతమంది మాత్రం కథానాయకుడు సినిమా సెన్సార్ కంప్లీట్ అయిపొయింది అని,కట్స్ ఏమీ లేకుండానే క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చారు అని అంటున్నారు.

అయితే ఆల్రెడీ బిజినెస్ కూడా అయిపోయిన సినిమాకి సెన్సార్ డీటెయిల్స్ గాని,అక్కడ టాక్ వల్ల గాని ఏమీ నష్టం ఉండదు.సెన్సార్ అయిపోయిన విషయం నిజమే అయితే దాన్ని దాచిపెట్టడం వల్ల సినిమా టీమ్ కి వచ్చే లాభం ఏంటి? అనేది ఎవ్వరికి అంతు పట్టట్లేదు.మొత్తానికి రిలీజ్ కి ముందే ఇలా రకరకాలుగా వార్తల్లో నిలుస్తున్న కథానాయకుడు రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.