దేశంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర

lok sabha elections Phase 4
lok sabha elections Phase 4

లోక్‌సభ ఏడ‌వ‌ దశ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం తెర పడింది. దీనితో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలతో ఒక రోజు ముందుగానే గురువారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభలో, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ షివ్లూలో ఎన్నికల ర్యాలీలో ఇవాళ పాల్గొన్నారు. దేశంలో చివ‌రి విడ‌త ( ఏడ‌వ ) గా జ‌రిగే ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం ముఖ్య‌మైన పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల య‌ద్దానికి దారితీసింది. ఈ నెల 19 న జ‌రిగే ఏడ‌వ విడ‌త పోలింగ్ కు ఎన్నిక‌ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేప‌ట్టారు.