అనంతపూర్ పిల్ల ఎవరికీ నచ్చలేదా?

priyanka-jawalka

తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో ఛాన్సులు రావు,కాస్టింగ్ కౌచ్ కంపల్సరీ అన్న నెగిటివిటీస్ అన్నిటిని దూరం చేస్తూ టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక జవాల్కర్.ఆరిజిన్ పరంగా మహారాష్ట్ర అమ్మాయి అయిన ప్రియాంక పుట్టింది,పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి తెలుగమ్మాయి అనేసుకోవచ్చు.అయితే ఆమె హీరోయిన్ అయినంత తేలికగా కెరీర్ ని కంటిన్యూ చేయలేకపోతోంది.

టాక్సీవాలా సక్సెస్ తరువాత ఈ అమ్మాయి గురించి అనేకవార్తలు ప్రచారం లోకి వచ్చాయి.చాలా సినిమాల్లో ఈ అమ్మాయి హీరోయిన్ గా సెటిల్ అయ్యింది అని ప్రచారం సాగింది.కట్ చేస్తే అవేవీ కూడా డిస్కషన్స్ స్టేజ్ దాటలేదు.చిన్న అవకాశాలు వస్తాయి కానీ వాటికి ఆమె పరిమితం కాదలచుకోలేదు.రీసెంట్ గా గీతా ఆర్ట్స్ లో అఖిల్ సినిమా ఒకటి సెట్ అయ్యింది.బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్.ఆ సినిమాలో అనంతపూర్ పిల్లకు అవకాశం వచ్చింది అన్నారు.

గీత్ ఆర్ట్స్ కాబట్టి ఆమెకి ఈ సారి ఈ అవకాశం పక్కా అనుకున్నారు.కానీ అది కూడా ఫైనల్ కాలేదు.అసలు ఆమె విషయంలో ఏవి నిజం? ఏవి రూమర్స్ అని నమ్మడానికి లేకుండా పోతుంది.మరి ఆల్రెడీ చేతిలో తమిళ్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అరవ సినిమాల్లో అదరగోట్టడానికి అక్కడికి వెళుతుందా లేక తెలుగులోనే తన అదృష్టం పరీక్షించుకుంటుందా అనేది వేచి చూడాలి.