హిస్ట‌రీ క్రియేట్ చేయ‌నున్న నిజామాబాద్ ఎల‌క్ష‌న్స్

Nizamabad MP
Nizamabad MP

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఈవీఎంలతోనే ఎన్నికల నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉమేష్ సిన్హా వెల్ల‌డించారు. నిజామాబాద్ పోలింగ్ విషయమై పూర్తిస్థాయిలో చర్చించినట్లు ఆయన తెలిపారు . అభ్యర్థులు భారీగా ఉన్నప్పుడు ఈవీఎం, వీవీప్యాట్‌లు వాడటం ఇదే తొలిసారన్నారు ఆయ‌న‌. మొదటిసారి నిజామాబాద్‌లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు.

25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2 వేల కంట్రోల్ యూనిట్లు అవసరమన్నారు. ఈవీఎంలను మొదటిసారి హైదరాబాద్‌లోనే తయారు చేశారని.. ఎక్కువమంది అభ్యర్థులకు ఈవీఎంలతో పోలింగ్ జరపటం కూడా ఇక్కడే చరిత్రగా నిలుస్తుందన్నారు. బుధ‌వారం నుంచి ఫస్ట్ లెవల్ ఈవీఎం చెకింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ఆయ‌న వివ‌న‌రించారు. నిజామాబాద్‌లో 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు.