అల్లు అర్జున్ కి జోడీగా నివేథా…!

Nivetha Pethuraj
Nivetha Pethuraj

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం రెండోవ షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నివేథా పేతురాజ్‌ను ఎంపిక చేసారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో బన్నీ, పూజాలతో పాటు నివేథా కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా చిత్ర యూనిట్తెలిపింది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీత ఆర్ట్స్ పతాకంఫై చిన్న బాబు,అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.