హిట్ కోసం నితిన్ పాట్లు

nithiin coming with beeshma
nithiin coming with beeshma

కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్ తో యూత్ ఫుల్ హీరోగా సెటిల్ అయిపోయిన నితిన్ ఆల్మోస్ట్ టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరితో సినిమాలు చేసాడు.కానీ ఆ తరువాత ట్రాక్ తప్పి రకరకాల సినిమాలు చేసి పదేళ్ళపాటు హిట్ అన్నదే లేకుండా కెరీర్ కొనసాగించాడు.ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ మీదకి వచ్చిన నితిన్ మళ్ళీ కథలఎంపికలో చేసిన పొరపాట్లకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు అతితక్కువ మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు నితిన్.అయితే అతను బాగా నమ్మిన శ్రీనివాసకల్యాణం కూడా ఊహించని షాక్ ఇచ్చింది.దాంతో ముందు విని ఉన్న ప్రాజెక్ట్స్ ని పక్కనబెట్టి సడెన్ సర్ప్రైజ్ హిట్స్ అందిస్తున్న యంగ్ టాలెంట్ కోసం సెర్చ్ చేసి చివరికి ఛలో తో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములు దగ్గర ఆగాడు.అతను లైన్ చెప్పినంత ఇంప్రెసివ్ గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు,టైటిల్ చెప్పినంత ఫాస్ట్ గా బౌండెడ్ స్క్రిప్ట్ చిక్కలేదు.చివరకు నితిన్ కూడా కూర్చుకుని కిందామీద పడి చివరకు భీష్మ ప్రాజెక్ట్ కి ఒక రూపం తెచ్చారు.

త్వరలో పట్టాలెక్కబోతుంది భీష్మ.ఇక్కడివరకు అంతా బాగానేవుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకోసం భారీ టెక్నీషియన్స్ ని కూడా తీసుకుంటున్నారు.కానీ ఈ సినిమా లైన్ కూడా ఛలో ఫార్మాట్ లోనే ఎంటర్టైన్మెంట్ ని బేస్ చేసుకునే సాగుతుందట.సింగిల్ ఫరెవర్ అనే ఈ ట్యాగ్ లైన్ తోనే ఈ సినిమా ట్రీట్మెంట్ ని మలిచారు అని తెలుస్తుంది.ఒక్క స్టోరీ విషయంలోనే కాదు మిగతా విషయాల్లో కూడా నితిన్ ని కన్వీన్స్ చేసి మరీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకుంటున్నాడు.ఛలో లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న ఈ సినిమాలో కూడా ఫిమేల్ లీడ్.

నిజానికి ఛలో సినిమా హిట్ అయినా కూడా మెయిన్ పాయింట్ ను చాలా ఎస్కెపింగ్ గా చెప్పారు.కానీ అన్నీ కలిసొచ్చి అది గట్టెక్కింది.కానీ భీష్మ విషయంలో మాత్రం అలానే జరుగుతుంది అనే గ్యారంటీ లేదు.లైన్ లో డెప్త్ ఉంటే నితిన్ హిట్ కోరిక తీరుతుంది.లేదంటే మాత్రమే మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టే.