ముద్ర పేరు మారింది

Arjun Suravaram
Arjun Suravaram

ముద్ర…మూడునెలల ముందు నుండి కూడా ఈ సినిమా పేరు విపరీతంగా వినిపిస్తుంది.నిఖిల్ సినిమాకి ఈ పేరు ఫిక్స్ చేసారు.అయితే ఈ మధ్య ఈ టైటిల్ పై పెద్ద రచ్చ జరిగింది.అసలు ఆ టైటిల్ టాగోర్ మధు దగ్గర లేదు అని ఆరోపించాడు నట్టికుమార్.ఆ టైటిల్ నిజంగా ముద్ర ప్రొడ్యూసర్స్ దగ్గర ఉందా? లేదా?అనే విషయం పక్కనబెడితే అంత రచ్చ జరిగాక ఆ టైటిల్ తో పోజిటివిటీ కంటే నెగెటివిటీ ఎక్కువ గెయిన్ అవుతుంది అని ఒక కంక్లూషన్ కి వచ్చారు.

ఈ విషయం జనాల్లోకి తీసుకెళ్ళడానికి నిఖిల్ సోషల్ మీడియా ని బాగా వాడుకున్నాడు.మా సినిమాకి ఒక టైటిల్ సజెస్ట్ చెయ్యమని ఒక కాంటెస్ట్ కూడా రన్ చేసాడు.అయితే ముద్ర అంత ఇంపాకీ ఉన్న టైటిల్ ఇంకొకటి దొరకడం కష్టమైంది.దీంతో ఆ సినిమాలో హీరో పేరయిన అర్జున్ సురవరం అనే పేరుతో ముద్ర ని రీప్లేస్ చేసారు.అర్జున్ అనే టైటిల్ నిఖిల్ కి బాగా కలిసొస్తుంది.అందుకే అర్జున్ లెనిన్ సురవరం అనే హీరో పాత్ర పేరులోనుండిఅర్జున్ సురవరం అనే టైటిల్ తీసుకున్నారు.

కనితన్ అనే సినిమాకి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.అయితే ఒరిజినల్ వెర్షన్ కి చేసిన చేంజెస్ వల్ల షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.ఇక ఈ ఫ్రెష్ టైటిల్, ఫ్రెష్ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు.మార్చ్ 29 న అర్జున్ సురవరం సినిమా రిలీజ్ అవుతుంది.లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ ప్రెస్ రిపోర్టర్ గా కనిపించబోతున్నాడు.అవుట్ ఫుట్ పై టీమ్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు.పైగా సమ్మర్ సీజన్ కూడా సినిమా కలెక్షన్స్ కి హెల్ప్ అవుతుంది.రిలీజ్ కి ముందే ఇన్నిరకాలుగా వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.