వరుస సినిమాలతో వస్తున్న నిఖిల్

Nikhil

గతకొంతకాలంగా డిఫరెంట్ అండ్ హిట్ సినిమాలు చేస్తూ మీడియం రేంజ్ హీరోస్ లో తన రేంజ్ అండ్ క్రేజ్ విపరీతంగా పెంచుకున్నాడు నిఖిల్.అయితే ఈ మధ్య మాత్రం కాస్త తడబడ్డాడు,అలాగే వెనుకబడ్డాడు కూడా.2018 కి నిఖిల్ కి గట్టి స్ట్రోక్ ఇచ్చింది.ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.రీమేక్ సినిమాగా తలెకెత్తున్న ముద్ర జాడలేదు.అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై ఎవ్వరికి క్లారిటీ లేదు.అంటే సినిమాలో కంటెంట్ కూడా కాస్త డౌట్ ఫుల్ అనే టాక్ మామూలుగానే స్ప్రెడ్ అయిపొయింది.దానిపై కూడా సైలెన్స్ గా ఉన్న నిఖిల్ ఎట్టకేలకు స్పదించాడు.

ఈ సంవత్సరంలో ఒకటి కాదు,రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి అని అభిమానులకు హామీ ఇస్తున్నాడు.ముద్ర అండ్ శ్వాస లతో పాటు ఇంకా మొదలుపెట్టని ఒక సినిమా కూడా 2019 లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే మూడు సినిమాలు ఓకే చేసాడట నిఖిల్.తన గ్రాఫ్ డౌన్ అయ్యింది అని ఫీల్ అవుతున్న నిఖిల్ కాస్త గ్యాప్ తీసుకుని మరీ కొత్త సినిమాలు ఓకే చేసాడు.2018 లో తగ్గిన ఈ యంగ్ హీరో 2019 ఎలా రెచ్చిపోతాడో చూడాలి.