దిల్ రాజు చేతుల్లోకి మెగా డాటర్ సినిమా

Suryakantam to Dil Raju
Suryakantam to Dil Raju

సినిమా ఇండస్ట్రీలో ఎవరు సినిమా తీసినా దాన్ని దిల్ రాజు చేతుల్లో పెట్టి రిలాక్స్ అవ్వడం అనేది ఇండస్ట్రీ లో కామన్ గా జరిగే తంతే.ఎందుకంటే దిల్ రాజు కి ఉన్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్,పబ్లిసిటీ స్ట్రాటజీ,మార్కెటింగ్ ఎబిలిటీ కి తిరుగులేదు.ఇక దిల్ రాజు బ్యానర్ కి ఉన్న గుడ్ విల్ గురించి చెప్పేదేముంది.అందుకే దిల్ రాజు ఏదైనా సినిమా రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాపై కాస్త ఎక్కువ ఫోకస్ ఉంటుంది.

ఇప్పడు మెగా డాటర్ నటించిన మిస్సెస్ సూర్యకాంతం సినిమా కూడా దిల్ రాజు చేతుల్లోకి వెళ్ళింది.తక్కువ ఖర్చుతోనే తెరకెక్కిన ఈ సినిమాకి వరుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరించడం,ఈ సినిమాని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ నిర్మించడం,ఈ సినిమా టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో దిల్ రాజు ఈ సినిమా తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో నిహారిక సరసన ప్రముఖ ఫైట్ మాస్టర్ కుమారుడు అయిన రాహుల్ విజయ్ హీరోగా నటిస్తుండగా గతంల నిహారిక తోనే ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన ప్రణీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా పట్ల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.

నిహారిక సెటిల్ కామెడీ ఆకట్టుకునేలా ఉంది.దీంతో ఈ నెల 29 న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.అయితే అదే రోజు నిఖిల్ నటించిన అర్జున్ సురవరం కూడా రిలీజ్ అవుతుంది.మరి సురవరం తో పోటీ పడుతున్న సూర్యకాంతం పై చేయి సాధిస్తుందో లేదో ఆ రోజే తేలుతుంది.ఈ సినిమా విజయం నిహారిక కెరీర్ కి చాలా అవసరం.మరి మెగా డాటర్ లక్కు వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.