ఎన్ ఐ ఏ క‌స్ట‌డీకి జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్న‌కేసు నిందితుడు

Jagan-Attack
Jagan-Attack

వైసిపి అధినేత జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జగన్‌పై దాడి కేసును ఏపీ పోలీసుల నుంచి ఎన్‌ఐఏకు బదిలీ చేసింది.ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చారు.ఇప్పటివరకూ నిందితుడు శ్రీనివాసరావును తాము విచారించలేదని,కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఐఏ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు వారం రోజుల పాటు శ్రీనివాసరావును కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. శ్రీనివాసరావుకు 3 రోజులకోసారి వైద్య పరీక్షలు చేయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశించింది.నిందితుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకూడదని స్పష్టం చేసింది.