పాత – కొత్త మేళవింపుతో సిఎం కేసీఆర్ కొత్త కేబినెట్

new cabinet ministers
new cabinet ministers

1. అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి : గతంలో రెండుసార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 2014లో బీఎస్పీ నుంచీ ఎన్నికై పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. గత ప్రభుత్వంలో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయ‌న నిర్మ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

2. త‌లసాని శ్రీనివాస్ యాదవ్ : వ‌రుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు మంత్రిగా పని చేశారు. సమైక్య రాష్ట్రంలో కూడా మంత్రిగా పని చేశారు. గత ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా సేవలు అందించారు. స‌న‌త్ న‌గ‌ర్ నుంచి త‌ల‌సాని ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

3. జగదీశ్వర్ రెడ్డి : ఆది నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో విద్యుత్, షెడ్యూల్డ్ కుల అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశారు. సూర్యాపేట నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

4. ఈటల రాజేందర్ : టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత‌గా గుర్తింపు పొందారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. గతంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2014 ప్రభుత్వంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రిగా పని చేశారు. తాజాగా ఆయ‌న హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

5. నిరంజన్ రెడ్డి : టీఆర్ఎస్ సీనియర్ నేత. వనపర్తి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా పని చేసిన అనుభ‌వం వుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

6. కొప్పుల ఈశ్వర్ : టీఆర్ఎస్ పార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో ఆయ‌న ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. 2014లోనే మంత్రి పదవి వస్తుందని అంద‌రూ ఆశించారు. అయితే ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. ఇప్పుడు ధ‌ర్మ‌పురి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

7. ఎర్రబెల్లి దయాకర్ రావు : వర్ధన్నపేట నుంచి మూడుసార్లు, పాలకుర్తి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2014లో టీడీపీ నుంచి గెలుపొంది, తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

8. శ్రీనివాస్ గౌడ్ : గతంలో ఉద్యోగ సంఘం నాయకునిగా పని చేశారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా వున్నారు.

9. వేముల ప్రశాంత్ రెడ్డి : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలిచారు. రెండుసార్లు ఎమ్మెల్యే గా ప‌నిచేసిన అనుభ‌వం వుంది. 2001 నుంచి టీఆర్ఎస్‌లో ఉన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. తాజాగా ఆయ‌న బాల్కొండ ఎమ్మెల్యేగా వున్నారు.

10. చేమకూర మల్లారెడ్డి : మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత. 2014లో మల్కాజ్ గిరి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తరవాత టీఆర్ఎస్‌‌లో చేరారు. తాజాగా మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.