అంజలి CBI రివ్యూ

నటీనటులు : నయనతార, రాశిఖన్నా, అనురాగ్ కశ్యప్, అథర్వా , విజయ్ సేతుపతి
దర్శకత్వం : అజయ్ జ్ఙానముత్తు
నిర్మాతలు : రాంబాబు, గోపినాథ్ అచంట
సంగీతం : హిప్ హప్ తమిళ
సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ
విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019

రేటింగ్ : 2.75/5

ఈ మధ్య ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ వస్తున్న నయనతార చేసిన మరో డైనమిక్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా అంజలి సిబిఐ.తమిళ్ లో ‘ఇమైక్కల్ నోడిగల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో అంజలి సిబిఐ పేరుతో అనువదించారు.మరి ఈ సినిమా నయనతారకి మరో హిట్ అందించిందా లేక జస్ట్ వచ్చి వెళ్ళింది అనిపించుకుందా అనేది ఇప్పడు చూద్దాం.

కథ:

బెంగుళూరు లో వరుసగా సీరియల్ కిల్లర్స్ జరుగుతుంటాయి.వాటికి కారణం ఏంటో తెలుసుకుని,వాటి వెనుక ఉన్న రుద్ర అనే వ్యక్తిని పట్టుకోవడానికి సిబిఐ ఆఫీసర్ అయిన అంజలిని అప్పాయింట్ చేస్తారు.అయినా కూడా ఆ హత్యలు ఆగవు.అంజలి తమ్ముడు అయిన అర్జున్ ని రుద్ర గా ఫ్రేమ్ చేస్తాడుఆ సీరియల్ కిల్లర్.దీన్తజో అంజలి ని సస్పెండ్ చేసి ఆ కేస్ ని వేరే వాళ్లకు అప్పగిస్తారు.అయితే మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన మార్టిన్ రుద్ర గా చలామణి అవుతూ ఆ హత్యలు చేస్తున్నాడు అని రివీల్ అవుతుంది.అసలు ఈ మార్టిన్ ఎవరు?.అంజలిని ఎందుకు టార్గెట్ చేసాడు?,అతను మర్డర్స్ చెయ్యడం వెనుక ఉన్న మోటో ఏంటి? అంజలి అతని గేమ్ కి ఎలా ఎండింగ్ ఇచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

ఇంతకుముందు సీరియల్ కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో అనేక థ్రిల్లర్ మూవీస్ చూసాం.కానీ వాటినుండి ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపేది మాత్రం ఆ కిల్లర్ మర్డర్స్ వెనుక ఉన్న మోటో,అంజలి గతం.అయితే ముందు కథ నడచినంత పకడ్బందీగా అవి ఉండవు.అలాగే ఈ మర్డర్స్ మధ్య అంజలి తమ్ముడు అయిన అర్జున్(అథర్వ),కీర్తి(రాశి ఖన్నా) ల లవ్ స్టోరీ కూడా ఫోర్స్డ్ గా అనిపిస్తూ స్పీడ్ బ్రేకర్ లా ఫ్లో ని బ్రేక్ చేస్తుంది.ఇక విలన్ సూపర్ నాచురల్ యాక్ట్స్ కూడా కాస్త అతిశయోక్తిగానే ఉంటాయి.అలాగే కథలో అసలు ట్విస్ట్ రివీల్ అయిపోయాక కూడా క్లయిమాక్స్ పూర్తిగా నిస్సారంగా,రొటీన్ గా ముగుస్తుంది.అలాగే అంజలి పెర్సనల్ లైఫ్ ఈ కథకి కనెక్ట్ చేసిన విధానం కూడా అంత కన్వీసింగ్ గా అనిపించదు.

నటీనటులు:

తమిళ నాట లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార ఈ సినిమాలో అంజలి పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది.అన్ని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది.ఇక ఈ సినిమాలో విలన్ గా కనిపించిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వల్ల ఎలాంటి ప్రత్యేకత లేని ఆ పాత్రకి కాస్త వెయిట్ దక్కింది.అథర్వ రోల్ కూడా బావుంది.ఆ రోల్ లో అతని పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది.రాశి ఖన్నా పాత్రకి ఎలాంటి ప్రత్యేకత గాని,ప్రాధాన్యత గాని లేదు.అతిపాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేసాడు విజయ్ సేతుపతి.మిగతా వాళ్లంతా షరా మామూలుగానే నటించారు.

టెక్నీషియన్స్:

అజయ్ జ్ఞానముత్తు రాసుకున్న కథ కొత్తది కాకపోయినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని బాగా డిజైన్ చేసుకున్నాడు.అతను రివీల్ చెయ్యాలి అనుకునేవరకు కూడా ట్విస్ట్ రివీల్ కాకుండా సినిమాని గ్రిప్పింగ్ గానే నడిపించాడు.కానీ మధ్య లో వచ్చే లవ్ ట్రాక్ ని వేరే విధంగా కథకు అడ్డం పడకుండానో,లేక పూర్తిగా ఎంటర్టైనింగ్ గానో చెప్పాల్సింది.అలా చెప్పకపోవడం వల్ల అది సినిమా ఫ్లో కో అడ్డం పడుతూ సాగింది.అలానే సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తరువాత సినిమాని సాగదీసినట్టుగా అనిపించింది.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలిచింది.సినిమా మూడ్ స్విఫ్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఎలివేట్ అయ్యాయి.ఇక హిప్ హాప్ తమిళ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది.అక్కడక్కడా ధ్రువ ఆర్.ఆర్ ని గుర్తు చేస్తుంది.

చివరిగా:

అనువాద చిత్రంగా ప్రేక్షకులముందుకు వచ్చిన అంజలి సిబిఐ లో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.కానీ తెలుగు వాళ్లకు పరిచయం ఉన్న నటీనటులు పెద్దగా లేకపోవడం ఒకటే ఈ సినిమాకి కాస్త అననుకూల అంశం.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

బోటమ్ లైన్ : అంజలి సిబిఐ… ఆకట్టుకుంటుంది