సీబీఐ ఆఫీసర్‌గా నయనతార

Nayana Tara, Super Star, Imaikka Nodigal , Angali CBI,

లేడీ సూప‌ర్‌స్టార్ గా న‌య‌న‌తార న‌టించిన సినిమా ‘ఇమైక్క నోడిగ‌ల్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంజ‌లి సీబీఐ’ టైటిల్‌తో అనువదిస్తున్నారు. ఆర్. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ సినిమాను తెర‌కెకిస్తున్నారు . న‌య‌న‌తార ఈ సినిమా లో సీబీఐ ఆఫీస‌ర్‌గా టైటిల్ రోల్‌ను పోషించారు. ఈసినిమా లో అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ప్ర‌తినాయకుడిగా ఇందులో కనిపించారు. నయనతార భర్త ‘విక్ర‌మాదిత్య’గా ప్ర‌ముఖ హీరో విజ‌య్ సేతుప‌తి నటిస్తున్నారు. సీజే జ‌య ‌కుమార్ ఈ సినిమాను కు నిర్మాత . హిప్‌హాప్ త‌మిళ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా కు ఆర్.డి రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ .

ఇటీవల తమిళంలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన ఉంది. ఈ నేపథ్యంలో తెలుగునూ విడుదల అవితుంది. ఇప్పుడు అనువాద కార్య‌క్ర‌మాలు వేగంగా జ‌రుగుతున్నాయని చిత్ర బృందం పేర్కొంది. విశ్వ‌శాంతి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌లు సీహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్ తెలుగు హ‌క్కుల్నిను ద‌క్కించుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 22నే తెలుగు వెర్షన్‌ను‌ విడుద‌ల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.