చరణ్ కి ఓకే చెప్పిన నయనతార

nayantara accept charan request
nayantara accept charan request

నయనతార వరుసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ,వాటితో అసాధారణ కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటూ లేడి సూపర్ స్టార్ అనే బిరుదు సైతం సాధించుకుంది.ఆమెకి ఉన్న బిజీ కి తమిళ్ తప్ప వేరే సినిమాలు చేసే టైం లేదు.కానీ సైరా కోసం భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకొచ్చారు.నయన్ ఉంటే తమిళ్ లో సైరా కి వచ్చే వెయిట్ వేరు.అందుకే కోట్ల లో అమౌంట్ తో పాటు హీరో తో ఇంటిమేట్ సీన్స్ చెయ్యను అనే కండిషన్స్ మీద సైరా కి ఓకే చెప్పి ఆమె వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసింది కూడా.నయనతార కండిషన్స్ లిస్ట్ లో మరో మెయిన్ పాయింట్ ప్రమోషన్స్ కి దూరంగా ఉండడం.

ఇంతకుముందు చాలామంది నిర్మాతలు ఆమెని ప్రొమోషన్స్ కి రమ్మని బ్రతిమాలారు.వాళ్ళనుండి తప్పించుకోవడానికి ప్రమోషన్స్ కోసం 50 లక్షలు డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది.కానీ సైరా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ మాత్రం ఆమెని సైరా ప్రమోషన్స్ కోసం ఒప్పించడం ఒక వండర్ గా మారింది.ముందు సైరా కి కూడా ని చెప్పింది.కానీ సెట్స్ ఫై ,షూటింగ్ లో ఆమెకి ఇచ్చిన రెస్పెక్ట్ అండ్ ట్రీట్మెంట్ కూడా కన్సిడర్ చేసి ప్రొమోషన్స్ కి ఓకే చెప్పింది.అలాగే సైరా రెగ్యులర్ సినిమా కూడా కాదు.అది కూడా నయన్ డెసిషన్ కి ఒక కారణం అయ్యుండొచ్చు.ఏది ఏమైనా నయనతార సైరా ప్రమోషన్స్ కి ఒప్పుకోవడం సెన్సేషన్ గా మారింది.ఆ ప్రమోషన్స్ లో ఆమె చెప్పే ప్రతి మాట సైరా మైలేజ్ పెంచుతుంది.