నాని ‘జెర్సీ’ సినిమా అప్డేట్…!

Jersey Movie

‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘జెర్సీ‘.నాని సరసన శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇటివలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలచేయనున్నారు.దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ ఇటివలే విడుదల చేసింది.అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం ఈఏడాది ఏప్రిల్ 19న విడుదల కానుంది.