ఏపికి నారా రాజ్యాంగం రాసుకున్నారు – వైసిపి ఎమ్మెల్యే రోజా

Roja Selvamani is a South Indian actress and politician
Roja Selvamani is a South Indian actress and politician

పక్కా ప్లాన్‌ ప్రకారమే జగన్‌పై దాడి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్‌పై కత్తి దాడి వెనుక చంద్రబాబు అండ్‌ కో ఉందన్నారు.

జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏ కు అప్పగించినప్పటి నుంచి అసలు నిందితులంతా వణికిపోతున్నారన్నారు. అప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్లంతా, ఇప్పుడు దానిని దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 13 జిల్లాలకు భారత రాజ్యాంగం బదులు నారా రాజ్యాంగం రాసుకున్నారని విమర్శించారు. జగన్‌పై ఎవరి కుట్రో త్వరలో తెలిసిపోతుందన్నారు. ఆపరేషన్‌ గరుడ స్టోరీలో జగన్‌పై అటాక్‌ జరుగుతుందని చెప్పించారని… అదే జరిగిందన్నారు .