దావోస్ టూర్ లో మంత్రి లోకేష్ బిజీ

Nara Lokesh,WEF annual meeting,Davos,Switzerland, Andhra pradesh
Nara Lokesh,WEF annual meeting,Davos,Switzerland, Andhra pradesh

ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధ‌మ‌ స్థానంలో ఉందన్నారు మంత్రి లోకేష్ . కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాఉండా పెట్టుబడిదారుల సంతోషము తమకు ముఖ్యమని స్ప‌ష్టం చేశారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ ఇంద్రజిత్ బెనర్జీతో ఏపీ మంత్రి నారా లోకేష్ బృందంస‌మావేశం అయింది.

కేపీఎంజీ చైర్మన్ అండ్ సీఈఓ అరుణ్ కుమార్ తో మంత్రి లోకేష్ ఏపీ అధికారుల బృందం భేటీ అయ్యారు. . వీరితో ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడి దారుల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు వేదిక ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏపీకి, సిఐఐ సహకారం కావాలని కోరారు. ఏపీలో అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా చూస్తున్నామని, అనంతపురంలో ఆటో మొబైల్, తిరుపతిలో ఎలక్ట్రానిక్, విశాఖలో ఐటీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతుని సిఐఐ, కేపీఎంజీ ప్రతినిధులకు వెల్లడించారు.