గ్యాంగ్ లీడర్ రఫ్ఫాడించేస్తాడా?

Nani Gangleader
Nani Gangleader

హీరో నాని తన 24 వ సినిమాగా మొదలుపెట్టిన గ్యాంగ్ లీడర్ పై మెగా ఫ్యాన్స్ ఒక రేంజ్ లో రెచ్చిపోయి ట్రోలింగ్ చేసినప్పటికీ అది సినిమాకి ప్లస్ అయ్యిందే తప్ప మైనస్ కాలేదు.ఎందుకంటే గ్యాంగ్ లీడర్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే ఆ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.నాని సినిమాకి ఈ రేంజ్ లో రేటు రావడం అంటే కాస్త ఎక్కువ పెట్టినట్టే.

పైగా జెర్సీ తరువాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కృష్ణార్జున యుద్ధం ఇంప్రెషన్ ని జెర్సీ తుడిచేస్తుంది అని వాళ్ళ నమ్మకం కావచ్చు.ఇక ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించడం,మొత్తం అయిదుమంది హీరోయిన్స్ ఉండడం,క్లాస్ మూవీ లవర్స్ కి విక్రమ్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడం,మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అన్ కాంప్రమైజ్డ్ గా భారీ బడ్జెట్ తో నిర్మించడంతో ఈ సినిమాపై బిజినెస్ సర్కిల్స్ లో నమ్మకం కుదురుతుంది.

అయితే ఈ సినిమాకి నాని తో పాటు మరో ముగ్గురు రైటర్స్ కూడా కూర్చుని ఫైనల్ వెర్షన్ ప్రిపేర్ చేశారు అనే న్యూస్ మాత్రం కాస్త కంగారు పెడుతుంది.మరి బ్లాక్ బస్టర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.