చిరంజీవి సినిమా టైటిల్ తో వస్తున్న నాని…!

Natural Star Nani
Natural Star Nani

నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో జెర్సీ చిత్రం లో నటిస్తున్నాడు.జెర్సీ తో పాటు ఆయన విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో వేరొక చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఈ చిత్రం టైటిల్ ని చిత్రబృందం ప్రకటించింది.ఈ చిత్రానికి గ్యాంగ్‌లీడర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసారు.

గతంలో ఇదే టైటిల్‌తో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం సూపర్‌డూపర్‌ హిట్టయ్యింది. ఇప్పుడు అదే టైటిల్‌తో నాని రాబోతున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ, ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, బైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ ఏడాది ఆగష్టు లో ఈ సినిమా విడుదల కానుంది.