నాని గ్యాంగ్ లీడర్ అప్పుడే రచ్చ రచ్చ

Natural Star Nani
Natural Star Nani

అష్టా చమ్మా సినిమాతో అనుకోకుండా హీరోగా కెరీర్ మొదలు పెట్టిన నాని ఆ తరువాత కొన్ని తప్పటడుగులువేసినా భలే భలే మగాడివోయ్ సినిమా నుండి మాత్రం మళ్ళీ అదరగొడుతున్నాడు.చూస్తూ చూస్తూనే 24 వ సినిమా వరకు వచ్చేసాడు.రీసెంట్ గా జెర్సీ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోవడంతో విక్రమ్.కె.కుమార్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయిపోవడంతో నాని పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా టైటిల్ ఎన్ని అనౌన్స్ చేసింది టీమ్.

చిరు ఐకానిక్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ టైటిల్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారుచిరు కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమా గ్యాంగ్ లీడర్.చిరు మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి,కనీసం ఈ టైటిల్ పెట్టుకోవడానికి మెగా హీరోలు కూడా సాహసించట్లేదు.అయితే అంతటి పవర్ ఫుల్ టైటిల్ ని నాని సినిమాకి పెట్టడాన్ని మెగా ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.ఈ టైటిల్ అనౌన్స్మెంట్ రాగానే సోషల్ మీడియా లో ట్రోలింగ్ మొదలైపోయింది.

ఈ సినిమా కథ అయిదుగురు ఆవాళ్లకు సంబంధించింది.ఆడవాళ్ళ గ్యాంగ్ కి నాని గండ్ లీడర్.ఈ థీమ్ విన్న మెగా ఫ్యాన్స్ హార్ట్ అయ్యి సినిమా పేరు మ్చాలి అనే సింగల్ అజెండా తో ముందుకు వెళుతున్నారు.ఈ సినిమా టైటిల్ పై ప్రస్తుతం అయితే ఫుల్ నెగెటివిటీ ఉంది.నిజానికి ఇదే కథ ముందు అల్లు అర్జున్ కి నెర్రెట్ చేసాడు విక్రమ్.కె.కుమార్.కానీ ఆ స్టోరీ సెకండ్ హాఫ్ తో బన్నీ సాటిస్ఫాయి కాలేదు.మాక్సిమం ట్రై చేసి అక్కడ వర్క్ అవుట్ అవ్వక అదే కథని నాని కి చెప్పి ఒప్పించుకున్నాడు.

అయితే బన్నీతో సినిమా అనుకున్నపుడు పెట్టిన టైటిల్ సినిమా థీమ్ కి కూడా వర్క్ అవుట్ అవుతుందని అలా సెట్ చేసాడు.సినిమా హీరో మారినా థీమ్ మారట్లేదు కదా అని అదే టైటిల్ తో కంటిన్యూ అయిపోయాడు.కానీ దానికి రియాక్షన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని హీరో నాని గాని,డైరెక్టర్ విక్రమ్ గాని,ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ గాని ఊహించి ఉండరు.

కానీ మెగా ఫ్యాన్స్ ఎంతకూ శాంతించడలేదు.దీంతో ఈ సినిమా టైటిల్ పై మేకర్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుంది?,ఈ టైటిల్ తో ముందుకు వెళతారా లేదా అనే క్లారిటీ రావడానికి టైం పట్టేలా ఉంది. ఈ సినిమా అయితే చాలా త్వరగా అంటే…ఆగస్టు లోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది.