మూతి ముద్దులు మొదలుపెట్టిన నాని

Nani Lip Lock with Shraddha Srinath
Nani Lip Lock with Shraddha Srinath

నేచురల్ స్టార్ నాని చేసే సినిమాలు హిట్ అయిన ప్లాప్ అయినా కూడా చాలా క్లీన్ గా ఉంటాయి.వాటిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా పెద్దగా వినబడవు.అందుకే క్లాస్ అండ్ మాస్ అనే తేడా లేకుండా అంతా నాని సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.అయితే ఇప్పడు నాని జెర్సీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా ఒక ఎమోషనల్ ఎంటెర్టైనెర్ అని టీజర్ తోనే క్లారిటీ వచ్చింది.

అయితే ఆ సినిమా నుండి ఫస్ట్ వీడియో టీజర్ రిలీజ్ చేశారు.ఒక పాట నుండి కట్ చేసిన ఆ క్లిప్పింగ్ చుసిన వాళ్ళు చాలా మంది షాక్ అయ్యారు.అయితే దానికి సరయిన కారణం కూడా ఉంది.ఆ క్లిప్పింగ్ లో నాని ఆ సినిమా హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ తో లిప్ టు లిప్ కిస్ సీన్ లో నటించాడు.అది మరీ RX100 ,అర్జున్ రెడ్డి లా ఘాటు కిస్ కాకపోయినా లిప్ టు లిప్ కిస్సే.మొన్నటిదాకా అర్జున్ ని మీటూ వివాదంలోకి లాగిన శ్రద్ద శ్రీనాథ్ ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో కన్నడ వాళ్ళు అవాక్కవుతున్నారు.

అయితే ఒక పక్క విజయ్ దేవరకొండ రష్మిక కి లిప్ కిస్ ఇస్తే,నాని శ్రద్ద శ్రీనాథ్ తో లిప్ కిస్ లాగించాడు.అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ ఇద్దరూ కన్నడ హీరోయిన్స్ కావడం.ఇకనుండి వీళ్ళు కన్నడ సినిమాల్లో నటించేటప్పుడు వాళ్లు కూడా లిప్ కిస్ కావాలని డిమాండ్ చేస్తే అప్పుడు ఈ ఇద్దరు భామలు ఎం చేస్తారో.మొత్తానికి హిట్ కోసం ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా చేశాడు నాని.మరి ఇప్పుడయినా జెర్సీ రూపంలో ఒక హిట్ వస్తుందేమో చూడాలి.