జెర్సీ సెంటిమెంట్ V/S కాంచన-3 మాస్ కామెడీ

Jersey Vs Kanchana 3
Jersey Vs Kanchana 3

రంగస్థలం,భరత్ అనే నేను,మహానటి అంటూ వరుస బ్లాక్ బస్టర్స్ కొడుతూ 2018 లో టాలీవుడ్ కళకళలాడింది.కానీ ఈ సంవత్సరం మాత్రం సమ్మర్ లో 118 ఒక మోస్తరు విజయం అందుకుంటే,మజిలీ మాత్రం సాలిడ్ సక్సెస్ దక్కించుకుంది.అయితే అదే సక్సెస్ స్త్రీకి ని కంటిన్యూ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల తమ లక్కు టెస్ట్ చేసుకోవడానికి పేరున్న రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.వాటిలో ఒకటి హిట్ సీక్వెల్ అయిన తమిళ్ సినిమా డబ్బింగ్ బొమ్మ కాంచన-3 ,రెండోది నాని నటించిన సెంటిమెంట్ టచ్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా ఫిలిం జెర్సీ.జెర్సీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ నాని చాలా బాగా కనెక్ట్ అయ్యింది.దాంతో రెమ్యునరేషన్ కాకుండా సినిమా బిజినెస్ లో షేర్ తీసుకునేలా ఈ సినిమా కంప్లీట్ చేసాడు నాని.

ఈ సినిమా టీజర్,ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్నాయి.కానీ ఈ సినిమా హిట్ అవ్వాలంటే సెంటిమెంట్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అవ్వాలి.అలాగే క్రికెట్ థీమ్ కూడా స్టోరీ తో కలిసి ఉండాలి.లేదంటే ఇది కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే నచ్చిన సినిమాగా మిగిలిపోతుంది.సెన్సార్ దగ్గర క్లీన్ U సర్టిఫికేట్ దక్కించుకున్న ఈ సినిమా రన్ టైం రెండు గంటల నలభై నిముషాలు ఉండడం అనేది మాత్రం సినిమాకి ఉన్న చిన్న నెగెటివ్ కార్నర్.కాంచన-3 …ముని సినిమాతో స్టార్ట్ చేసి ఈ సిరీస్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి.అన్నింటిలో నవ్విస్తూ,భయపెట్టడం అనేదే ఫార్ములా.ఈ సినిమాని కూడా అదే ఫార్ములాతో తెరకెక్కించిన రాఘవ లారెన్స్ ఈ సారి కూడా విజయం దక్కుతుంది అనే ధీమాతో ఉన్నాడు.

ఈ సినిమా తమిళ్ లో,తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతుంది.ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ అండ్ గ్రాఫిక్స్ బావున్నాయి.కాకపోతే ఈ సినిమా నిడివి రెండు గంటల 55 నిమిషాలు అంటున్నారు.హారర్ సినిమా కి అంత రన్ టైం అంటే మెస్మరైజింగ్ కంటెంట్ ఉంటే తప్ప వర్క్ అవుట్ కాదు.జెర్సీ కంటెంట్ ని నమ్ముకుని థియేటర్స్ లోకి వస్తుంటే,కాంచన-3 మాత్రం బ్రాండ్ నేమ్ ని,మాస్ ఆడియన్స్ పల్స్ ని నమ్ముకుని రిలీజ్ అవుతుంది.రెండు సినిమాల ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి.మరి థియేటర్స్ లో ఏ సినిమా విజయం అందుకుంటుందో,లేక రెండూ హిట్ కొడతాయా అనేది మాత్రం కొన్ని గంటల్లో తేలుతుంది.