పీసీసీ కార్యదర్శి నగేష్‌‌పై సస్పెన్షన్ వేటు

Nagesh Mudiraj
Nagesh Mudiraj

పీసీసీ కార్యదర్శి నగేష్‌‌పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే కాంగ్రెస్ నిర్ణయాన్ని నగేష్ తీవ్రంగా తప్పుబట్టారు. అంతేకాదు గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు . తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయ‌న‌. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు. క్రమశిక్షణ సంఘం వి. హనుమంతరావుకు తొత్తులాగా పనిచేస్తోందని ఫైర‌య్యారు. ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద దీక్షా శిబిరంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, టీపీసీసీ సెక్రటరీ నగేష్ లు కుర్చీ కోసం కొట్టాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నగేష్ కింద పడిపోయారు. అనంతరం నగేష్ కూడా లాగడంతో వీహెచ్ కూడా కింద పడిపోయారు. ఈ ఘటనను పీసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఘర్షణ జరిగిన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. భేటీలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నగేష్‌కు షోకాజ్ నోలీసులిచ్చింది. అయితే సోమవారం నగేష్‌ను సస్పెండ్ చేస్తూ ప్రకటించింది.