‘ఏఎన్నార్‌’ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున…!

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

టాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వర్ రావు పై కూడా బయోపిక్ వస్తుంది అని ప్రచారం జరుగుతుంది.కానీ నాగార్జున మాత్రం నాన్నగారి మీద బయోపిక్ చేయట్లేదు అని తేల్చి చెప్పారు. అసలు నా ఫ్యామిలీ గాని నేను గాని ఎప్పుడు నాన్న గారి బయోపిక్ గురించి ఆలోచించలేదు, అసలు మాకు ఆయన సినిమాలు రీమేక్ చేయాలి అంటేనే చాలా భయం. అలాంటిది మేము నాన్న గారి బయోపిక్ ని ఎలా చేస్తాము. ఆయన బయోపిక్ అస్సలు ఉండదు అని స్ట్రాంగ్ గా చెప్పేసారు నాగార్జున.