నాగార్జున తో మహానటి…!

Keerthi Suresh
Keerthi Suresh

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగల్ షెడ్యూల్‌లో సమంతతో పాటు చిత్రం ప్రధాన పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించారు.తాజాగా షూట్ లో మహానటి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేష్ జాయిన్ అయింది.వీరిద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.