అక్కినేని నాగేశ్వర రావు బయోపిక్‌ పై …

Akkineni Nagarjuna

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. ప్రముఖుల జీవితం ఆధారంగా చాలా సినిమాలు తెరకేక్కుతున్నాయి.సావిత్రి గారి జీవితం ఆధారం ఆగా వచ్చిన ‘మహానటి’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అలాగే తాజగా ఎన్టీఆర్ జీవితం ఆధారం తెరక్కెకిన ‘కథానాయకుడు’ మంచి విజయం అందుకుంది.

ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వర రావు మీద సినిమా తీస్తారా అన్న చర్చ నడుస్తోంది. ఈ అంశంపై తిరుమల వచ్చిన అక్కినేని నాగార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌ గురించి త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. త్వరలోనే తాను నటించే కొత్త సినిమా వివరాలు కూడా చెబుతానన్నారు.ఏఎన్నార్‌ బయోపిక్‌పై మీడియా ప్రతినిధులు మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా. నాగార్జున నవ్వుతూ వెళ్లిపోయారు.