మాస్ తో జతకడుతున్న చంద్రముఖి

Nagarjuna-Jyothika
Nagarjuna-Jyothika

సోగ్గాడే చిన్ని నాయన సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఆ సినిమా విజయానికి సినిమాలోని బంగార్రాజు పాత్ర అత్యంత కీలకం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.అయితే ఇప్పుడు నాగార్జున ఆ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సోగ్గాడే చిన్న నాయనా సినిమాలో నాగార్జున కి భార్యగా రమ్యకృష్ణ నటించింది.కానీ ఈ సినిమా బంగార్రాజు పాత్రమీదే బేస్ అయి ఉంది కాబట్టి ఆ పాత్రకి కాస్త వెయిట్ ఉన్న హీరోయిన్ ని తీసుకుందాం అనేది యూనిట్ ప్లాన్.

అయితే ఆ పాత్రకి నయనతారని సంప్రదిస్తే తన బిజీ షెడ్యూల్ లో డేట్స్ కేటాయించడం కుదరదు అని చెప్పేసింది.దీంతో మంచి నటిగా పేరున్న జ్యోతికను సంప్రదిస్తున్నారు.పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మంచి వెయిట్ ఉన్న పాత్రలు దక్కించుకుంటుంది.పెళ్ళికి ముందు నాగార్జున తో మాస్ అనే హిట్ సినిమాలో కలిసి నటించింది కాబట్టి మళ్ళీ ఇప్పడు మరొకసారి నాగ్ తో ఆమె జతకట్టడానికి పెద్దగా అభ్యతరం ఉండకపోవచ్చు.ఆమె ఓకే అంటే మాత్రం బంగార్రాజు సెట్స్ మీదకి వెళ్లకుండానే ఫుల్ బజ్జ్ రావండం గ్యారంటీ.