నాగకన్య ట్రైలర్ : కంటెంట్ ఇంపాక్ట్ ఫుల్

NagaKanya
NagaKanya

సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ అండ్ గ్రాఫికల్ మిక్స్ తో ఉండే సినిమాలు ఎప్పుడూకూడా కిక్ అందిస్తాయి.ఇప్పడు తమిళ్ లో తెరకెక్కి తెలుగులోకి డబ్ అవుతున్న నాగకన్య కూడా ఆ కోవకి సంబందించిన సినిమానే.నాగకన్య బ్యాక్ డ్రాప్ లో పాగా తీర్చుకోవడం అనే సినిమాలు చాలా వచ్చాయి.కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్స్ అయిన వరు,కేథరిన్ అండ్ లక్ష్మీరాయ్ ముగ్గురూ కూడా నాగకన్యలుగా కనిపిస్తుండడం విశేషం.

వాళ్ళ మధ్య ఉన్న ఒక ఎమోషనల్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ ఎల్.సురేష్.జై హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి చాలా ఇంపార్టెన్సీ ఉంది.కొన్ని పెద్ద పెద్ద సినిమాలను చూపించి ఈ సినిమాలో గ్రాఫిక్స్ ని చాలా చులకన చేస్తున్నారు చాలామంది.కానీ పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టుగా విజువల్స్ ఉన్నాయి.

ట్రైలర్ చూపించినట్టుగా కథనం కాస్త గ్రిప్పింగ్ గా ఉండి,ఎమోషన్స్ కూడా పండితే మాత్రం నవ్విన ఈ నాగకన్య సినిమానే హిట్ అవుతుంది.సినిమాలో కూడా కాస్టింగ్ డీసెంట్ గా ఉంది కాబట్టి ఈ సినిమాని తక్కువ అంచనావెయ్యడానికి లేదు.ట్రైలర్ వరకు క్వాలిటీ పరంగా ఓకే అనిపిస్తూ కంటెంట్ పరంగా ఇంప్రెసివ్ గా ఉన్న నాగకన్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

 

Nagakanya Trailer