మెగా బ్రదర్ నాగబాబు.. బాలకృష్ణను టార్గెట్ చేస్తూ..

Naga Babu Ultimate Reply to Balakrishna on 6th Comment | Naga Babu Final Words for Balakrishna
Naga Babu Ultimate Reply to Balakrishna on 6th Comment | Naga Babu Final Words for Balakrishna

బాలకృష్ణ.. ‘ఎన్టీఆర్ కాలి గోటికి కూడా చిరంజీవి పనిచేయడు’ అని ఒక మాట అన్నారు. అది విన్నమెగా బ్రదర్ నాగబాబు చాలా కోపం, ఆవేదన కలిగాయి తను రియాక్ట్ అవుదామనుకునే లోపు చిరంజీవి గారు ‘బాలకృష్ణ చిన్న పిల్లవాడు. అతనికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు’ అంటూ పెద్దరికంగా సమాధానం ఇచ్చి ఊరుకున్నాడు.

మీ నాన్నగారు మీకు గొప్ప. ఏ కొడుకుకైనా తండ్రి గొప్పే. రిక్షా తొక్కే వ్యక్తికైనా సరే.. అతని కొడుక్కి రిక్షా తొక్కే తండ్రి గొప్పే. మీ నాన్నగారి గొప్పతనాన్ని కీర్తించుకోవడంలో తప్పు లేదు. సర్ మర్యాదగా చెబుతున్నా. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. వంద విమర్శలు చేయండి. మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి లూజ్ టంగ్ మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇక్కడ ఎవరికీ ఎవరూ భయపడే వ్యక్తులు లేరు. కేవలం సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం. కాబట్టి ఇలాంటి లూజ్ టంగ్ మాటలు ఆపేయండి. ఆపేస్తారని ఆశిస్తున్నాం. అంతే తప్ప మీతో ఎలాంటి గొడవలూ లేవు. మా అన్నయ్యని.. మా తమ్మున్ని అంటే మాత్రం తప్పకుండా రియాక్ట్ అవుతాం. అది మీరు అవనివ్వండి.. వేరే ఎవరైనా అవనివ్వండి’’అని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఇక ఈ కామెంట్స్ ఇక్కడితో ఆపెదాం .. అని తన అబినమానులకు కూడా తను చెప్పాడు