జగన్ డైరెక్షన్- తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ – ‍ ఏపి సిఎం చంద్ర‌బాబు

N Chandrababu Naidu
N Chandrababu Naidu

ఐటి గ్రిడ్ డేటా కేసులో తెలంగాణ ప్రభుత్వం జగన్ డైరెక్షన్ లో పని చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. జగన్ డైరెక్షన్ అంతా ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన వినతి పత్రం, ఫిర్యాదు లేఖతో పాటు ఇచ్చేశారన్నార‌న్నారు. దొంగ ఎంత జాగ్రత్తగా దొంగతనం చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడని, అందుకు జగన్ వ్యవహారం నిదర్శనమన్నారు ఆయ‌న‌. జగన్ అండ్ కో అంటే ముగ్గురు మోడీలు ఒక తప్పు చేసి దానిని కప్పిపుచ్చుకోవడానికి తప్పుమీద తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

తెలుగుదేశం ఓట్ల తొలగించేందుకు వైసీపీ నేతలు మహాకుట్రకు నాంది పలికారని , ఈ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. టీడీపీకి నష్టం కలిగించేలా వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. కుట్రల కేంద్రంగా హైదరాబాద్ కు అప్రతిష్ట తెచ్చారన్నారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకే రక్షణ లేకపోతే ఎలా అనిఆయ‌న ప్ర‌శ్నించారు. విజయ సాయిరెడ్డి దర్శకత్వంలో అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. ఎటువంటి ఫిర్యాదూ లేకుండా ఐటీగ్రిడ్స్ పై దాడి చేసి డేటా స్వాధీనం చేసుకుని, ఉద్యోగులను అదుపులోనికి తీసుకున్నారనీ , కోర్టు చీవాట్లు పెట్టడంతో విడుదల చేశారని చంద్రబాబు వెల్ల‌డించారు. ఫిబ్రవరి 23న జరిగిన దాడి గురించి స్టీఫెన్ రవీంద్ర చెబుతారు కానీ సీపీ అంజ‌నీకుమార్ చెప్పరని అన్నారు. బాహుబలిలో భల్లాల దేవ కూడా ఇన్ని కుట్రలు చేయలేదన్నారు సిఎం చంద్రబాబు.