దేశం కోసం పోరాడుతున్నా – ఏపి సిఎం చంద్రబాబు

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులతో సరిపోల్చి చూడాలన్నారు ఏపి సిం చంద్రబాబు. తనతో పాటు విపక్ష పార్టీల నేతలందరూ ఈ డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. తాను దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందని ఆయన పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ మాత్రమే వాడుతున్నారని గుర్తు చేశారు. చాలాదేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదని తేల్చిచెప్పారు సి.ఎం చంద్రబాబు.