మిస్టర్ మజ్ను ట్రైలర్:టూ రొమాంటిక్

mr majnu

మిస్టర్ మజ్ను…మరో మహేష్ బాబు అని అక్కినేని అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే అఖిల్ కెరీర్ కి చాలా కీలకమైన సినిమా.ఈ సినిమా హిట్ అయితే అఖిల్ కెరీర్ ఇప్పటికయినా అనుకున్నట్టుగా హై లెవెల్ టేక్ ఆఫ్ తీసుకున్నట్టే.ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఉంటుంది అని కన్వే చేసిన వెంకీ అట్లూరి ఈ సారి కూడా సినిమాలో ఉన్న కంటెంట్ ని మరింతగా ఎలివేట్ చెయ్యాలని ట్రై చేసాడు.

ఈ సినిమాలో అఖిల్ ది పక్కా ప్లే బాయ్ క్యారెక్టర్.ఇక నిధి అగర్వాల్ కి ఈ సినిమాలో స్కోప్ ఎంత ఉంది అనేది సినిమా చూసాక మాత్రమే తెలుస్తుంది.ఇప్పటివరకు నటన పరంగా తడబడుతూ డెవలప్ అవుతున్న అఖిల్ ఈ సినిమాలో మాత్రం ఫ్రీ ఫ్లో అన్నట్టుగా నటించాడు.హీరోలతో ట్రావెల్ చేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డైలాగ్స్ రాసుకుని,క్యారెక్టర్ కి ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చే వెంకీ అట్లూరి ఈ సారి కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోయాడు.అయితే టాలీవుడ్ లో అనేకమంది డైరెక్టర్స్ కి ఇబ్బందిగా మారిన సెకండ్ సినిమా సిండ్రోమ్ ని వెంకీ ఎంతవరకు దాటతాడు అనేది చూడాలి.

ఈ సినిమాకి టెక్నికల్ టీమ్ మంచి ఎస్సెట్ గా మారింది.థమన్ BGM ,జార్జ్.సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ హైలైట్స్ గా నిలుస్తాయి.ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా కలరింగ్ ని పూర్తిగా మార్చేశాయి.మరి యంగ్ టీమ్ అంతా కలిసి రొమాంటిక్ ఎంటెర్టైనెర్ అనే పదానికి అర్ధంగా ఉండేలా రూపొందించిన మిస్టర్ మజ్ను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది జనవరి లో తెలుస్తుంది.ట్రైలర్ అయితే సేలబుల్ కంటెంట్ లా అనిపిస్తుంది.బాయ్స్ విల్ బి బాయ్స్ అనే కాప్షన్ కి ఇచ్చే జస్టిఫికేషన్ మీద సినిమా ఆధారపడిఉంది.